బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఎన్ఐఎన్ కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర శివాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతా రామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం ఆదివారం కన్నుల పండగగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జైశ్రీరామ్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి-ఉషారాణి దంపతులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.