భారత జాతిపిత మహాత్మాగాంధీ 153వ జయంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా కేంద్రంలోని మేడ్చల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గల మహత్మ గాంధీ విగ్రహానికి మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నర్సింహ్మ రెడ్డి తో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ. ఈ సందర్భంగా కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ.. గాంధీజీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా భారతజాతి ముందుండి నడిపి ఆంగ్లేయుల పాలనకు చరమగీతం పాడి భారతజాతిని విముక్తి గావించిన పూజ్య బాపూజీ జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ కమీషనర్ మహమ్మద్ షఫీఉల్లా ఖాన్, మేడ్చల్ పట్టణ మాజీ ఉప సర్పంచ్ మర్రి నర్సింహ్మా రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్స్ జాకట దేవరాజ్, బత్తుల శివ కుమార్ యాదవ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, నడికొప్పు నాగరాజు ముదిరాజ్, కో ఆప్షన్ సభ్యులు ఆకిటీ నవీన్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.