రాష్ట్రంలో వైరస్ అరికట్టడంలో జీహెచ్ఎంసీ కార్మికుల సేవలు మరువలేనివని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. గురువారం మల్లాపూర్ డివిజన్ లో కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి మరియు సివిల్ సప్లై చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి పారిశుద్ధ్య కార్మికులను, సీవరేజీ కార్మికులను, హమాలి కూలీలను సన్మానించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... పారిశుధ్య కార్మికులు ఎండనక వాననకా.. దుర్వాసనను భరిస్తూ.. వ్యర్థాలను తొలగిస్తూ అలుపెరుగని పోరుచేస్తున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మరింత పకడ్బందీగా సేవలందిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో సీవరేజీ కార్మికులు వీరోచితంగా పోరాడుతూ ఆదర్శంగా నిర్మిస్తున్నారని మేయర్ అన్నారు.