గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని దయానంద్ నగర్ లో చిల్డ్రన్ పార్క్‌ను మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రిరాజశేఖర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ మేకల సునీత యాదవ్‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక్కడి ప్రజలు భిన్నత్వంలో ఏకత్వాన్ని తలపిస్తున్నారని, మల్కాజిగిరి ప్రజలకు త్వరలోనే గౌతమ్ నగర్ ఆర్యూబీ నిర్మించి ట్రాఫిక్ కష్టాలు తీరుస్తామని అన్నారు.