నడిరోడ్డుపై నలుగురు చూస్తున్నారన్న ధ్యాస కూడా లేకుండా బైక్ పై వెళ్తున్న ఓ జంట అసభ్యంగా వ్యవహరించిన ఘటనపై బాలాపూర్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాలలో వారి ముఖాలు, బైక్ నంబర్ కూడా నమోదు కాలేదని, మరిన్ని కెమెరాలను కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.