లాక్డౌన్ సమయంలో తలసేమియా వ్యాధిగ్రస్తులు, పిల్లల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల పిలుపు మేరకు ఎల్ బి నగర్ నియోజకవర్గంలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం తాను కూడా స్వయంగా రక్తదానం చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త రక్తదానం చేసి చేయాలని.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించడానికి రక్తం ఎంతో అవసరమని ఎమ్మెల్యే అన్నారు.