రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ పండుగ సందర్భంగా కేపీహెచ్బీ కాలనీ 114 డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు కొల్లా శంకర్ మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతిని, పూలను ఆరాధించే అరుదైన పండుగ మన ఆడబిడ్డలదని అన్నారు. బతుకమ్మ సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవానికి ప్రతీక అని. మహిళలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకోవాలని సూచించారు.