కేపీహెచ్‌బీ కాలనీ శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం కూకట్పల్లి ప్రెస్ క్లబ్ సౌజన్యంతో నిర్వహించిన హెల్త్ క్యాంప్‌ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కేపీహెచ్‌బీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ రావు, మాజీ కార్పొరేటర్లు తూము శ్రావణ్ కుమార్, పగుడాల బాబురావు, హోలిస్టిక్ సిఈఓ డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ సిద్ధార్థలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పని చేస్తు అనునిత్యం వార్తల సేకరణలో ఉండే జర్నలిస్ట్‌లు తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్త వాహించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం పరిధికి చెందిన 48 మంది జర్నలిస్ట్‌లకు హోలిస్టిక్ యాజమాన్యం వైద్య పరిక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యుజే జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది బాలరాజు, ఉపాధ్యక్షుడు టి. పరమేష్, కూకట్పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎం. ఏ. కరీమ్, ప్రధాన కార్యదర్శి రంజిత్, ఉపాధ్యక్షుడు సముద్రాల కిరణ్, కార్యనిర్వాహక కార్యదర్శి నవీన్ రెడ్డి, సహాయక కార్యదర్శి జయకుమార్, సీనియర్ జర్నలిస్ట్‌లు నిమ్మల శ్రీనివాస్, ప్రభాకర్, మాణిక్యరెడ్డి, హరిబాబు, దామోదర్ రెడ్డి, గంగరాజు, సామాల రాము, నజీర్, నర్సింహా, కిరణ్, రహమాన్, రాకేష్, వెంకట్, బాషా, హోలీస్టిక్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ పిఎస్ గౌతమ్, డాక్టర్ పీజీ మేఘన తదితరులు పాల్గొన్నారు.