శేర్లింగంపల్లి నియోజకవర్గం, వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని బాగ్అమీర్, కూకట్పల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గుందడి యాదయ్య కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో సోమవారం సద్దుల బతుకమ్మ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంతమంది ఆడపడుచులు బతుకమ్మ ఆడడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలలో ఆడపడుచులకు ప్రత్యేక పండగని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే బతుకమ్మ పండుగ మహిళలందరినీ ఒకచోటకు చేరుస్తుందన్నారు. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే పండుగే బతుకమ్మ పండుగని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో గుందడి కుటుంబ సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.