కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నగరంలోని దేవాలయాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. నగరంలోని అన్ని దేవాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు వచ్చి శివుడికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివ నామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమ్రోగుతున్నాయి.