తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా గద్దర్ కూతురు డాక్టర్ గుమ్మడి వెన్నెలను నియమిస్తూ ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు వెన్నెలను నియమిస్తున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరి వెల్లడించారు. ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు తెలంగాణ సాంస్కృతిక ఔనత్యాన్ని ఇనుమడించే విధంగా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.