హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం, చత్రినక పోలీసులు కలిసి మంగళవారం అక్రమ మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తుల ముఠాను గట్టు రట్టు చేశారు. వారి నుంచి 405 లిక్కర్ బాటిళ్లను సీజ్ చేసినట్లు తెలిపారు. వీటి విలువ దాదాపుగా 70, 170 ఉంటుందని, నిందితులు ప్రభాకర్ రెడ్డి (58), చంద్రమోహన్ (50) ఇద్దరు కలిసి అక్రమ మద్యం విక్రయించడమే వారి వృత్తిగా ఎంచుకున్నట్లు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.