యాకుత్‌పుర రైల్వే స్టేషన్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. స్థానికంగా ఓ భవనంలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. భయాందోళనతో ప్రజలు ఇళ్లలోంచి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు అదుపుచేస్తున్నారు. షాట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.