లాక్ డౌన్ సమయంలో ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న పోలీసులు,డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు,మున్సిపల్ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది రెవెన్యూ సిబ్బందికి మంత్రి మల్లారెడ్డి సన్మానించారు. అనంతరం సిబ్బంది అందరితో కలిసి మంత్రి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో టి.ఆర్.ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, దీపికా నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్లు ప్రభాకర్, రమేష్, డాక్టర్లు,పోలీస్ అధికారులు,మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.