డెంగ్యూ చికెన్‌గున్యా, కలరా లాంటి వ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణకు, అవి వృద్ధి చెందకుండా ఉండడానికి ప్రతి ఆదివారం 10గంటలకు పది నిమిషాల పాటు విధిగా మన ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీరు ఖాళీ చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ శాంబిపూర్ రాజు ఉదయం తన నివాసంలో నిలిచి ఉన్న నీటిని శుభ్రం చేశారు. అనంతరం ప్రజలు ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.