పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ కేసు క్లోజ్ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా పోలీస్ స్టేషన్ ఎస్సై పవన్, కానిస్టేబుళ్ళు రామకృష్ణ, సంతోష్ కుమార్ లు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పట్టుబడిన వారి ఇళ్ళల్లో సైతం ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.