జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఇలంబర్తిని ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బెగ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు పెండింగ్ అభివృద్ది పనులకు సంభందించి వినతిపత్రం అందజేశారు. అభివృద్ది పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. సమస్యలను పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు.