నవాబ్ సాహాబ్ కుంట డివిజన్ పరిధిలో మహ్మద్ ముక్తార్ అనే వ్యక్తి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. విద్యుత్ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ముక్తార్ విద్యుత్ స్తంభంపై ఉండగానే విద్యుత్ షాక్ గు గురికావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్ సోమవారం బాధితుడిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మంచి వైద్య సేవలు అందించాలని సూచించారు.