సీఎంఆర్ఎఫ్ ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలను కాపాడిందని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బెగ్ అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో దోబీఘాట్ కు చెందిన తూహారా సుల్తానాకు మంజూరైన చెక్కును ఎమ్మెల్సీ అందజేశారు. రూ. 2లక్షల విలువ గల చెక్కును అందజేసినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. అర్హులైన వారు సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్పోరేట్ స్థాయి వైద్య సేవలను సీఎంఆర్ఎఫ్ ద్వారా ఉచితంగా పొందవచ్చన్నారు.