వృద్ధుల పట్ల నేటితరం చూపిస్తున్న నిరాదరణను పరిగణనలోకి తీసుకుని 1984లో వియన్నాలో తొలిసారి వృద్ధుల సమస్యలపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. ‘సీనియర్ సిటిజన్’ అనే పదాన్ని ఇక్కడే తొలిసారి వాడారు. సరిగ్గా ఆరేళ్ల తర్వాత 1990 డిసెంబర్ 14న ఐక్యరాజ్యసమితి వృద్ధుల కోసం ఒక నిర్దిష్ట ప్రణాళికను తయారుచేసి ప్రపంచ దేశాలన్నీ తప్పనిసరిగా అమలుచేయాలని ఆదేశించింది.
దాంతో ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఆవిర్భవించింది.