బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తాయి. వీటి ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా మంగళవారం మోస్తరు వర్షం, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిసింది. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 23 చోట్ల స్వల్పంగా వర్షాలు కురిశాయి.