ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పూనియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 4 ఏళ్ల పాటు బ్యాన్ విధించింది. ఈ నిషేధంపై తాజాగా పూనియా సంచలన వ్యాఖ్యలు చేశారు. వేధింపులకు గురైన మహిళలకు, అన్నదాతల పోరాటానికి సపోర్టుగా నిలిచిన రెజ్లర్లను లక్ష్యంగా చేసి.. మోడీ సర్కార్ అధికారుల ద్వారా తమను వేధిస్తోందని పూనియా ఆరోపణలు చేశారు. ఇప్పటికిప్పుడు బీజేపీలో చేరితే తనపై ఎలాంటి కేసులు, నిషేధాలు ఉండవని వ్యాఖ్యానించారు.