TG: SLBC ఘటనపై తెలంగాణ ప్రభుత్వ తీరు బాధకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడ నల్లగొండ జిల్లాలకు చెందిన నాయకులు SLBC టన్నెల్ వద్దకు వెళ్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల బయటకు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే సీఎం రేవంత్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారని.. ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు.