ఆనందంగా ఉండే ప్రతి సందర్భంలోనూ చాక్లెట్లు, స్వీట్స్ తినిపించుకోవడం అలవాటు. చిన్నపిల్లల విషయంలో ఇలా చేయడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లో షుగర్ కాండీలను ఇవ్వవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చక్కెర వాడుక తగ్గింపు భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుంది.