కులగణనకు 56 ప్రశ్నలు ఎందుకని వనపర్తి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి శనివారం ప్రశ్నించారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కులగణనకు వారి సామాజిక వర్గం వివరాలు సేకరిస్తే సరిపోతుందన్నారు. బ్యాంకు ఖాతా నంబర్లు, పశువుల వివరాలు అవసరమా అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం చేసేందుకే ఇన్ని ప్రశ్నలు పెట్టారన్నారు. సర్వేను పునఃపరిశీలించాలని అన్నారు.