ప్రజలు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపరాదని, ఏదైనా ప్రమాదం జరిగితే తల్లిదండ్రులతో పాటు నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. బాధ్యతారాహిత్యంతో వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు.