పెబ్బేరు స్థలంలో మీరు అవకాతవకలు చేయకుంటే అదే వేణు గోపాలస్వామి ఆలయంలోకి తడిబట్టలతో రావాలని అందుకు నేను సిద్ధమని ఆదివారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి సవాలు విసిరారు. అదేవిధంగా వనపర్తి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రాజా గారి స్థలంలోనూ కూడా ఎలాంటి అవినీతికి పాల్పడకుంటే వనపర్తి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి రావాలని ఆయన మరో మారు సవాల్ చేశారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడారు.