2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో ప్రవేశాల గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు వనపర్తి జిల్లా డిఐఈఓ అంజయ్య ఆదివారం తెలిపారు. ప్రైవేటు జూనియర్ కళాశాలలో రూ. 500 జరిమానాతో, ప్రభుత్వ కళాశాలలో ఫైన్ లేకుండా అక్టోబర్ 15 వరకు ఇంటర్ లో ప్రవేశం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించిందని అన్నారు.