దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ నవంబర్ 18, 1962 లో చైనా సైన్యంతో పోరాడి ప్రాణాలు అర్పించిన అమరవీరులకు సోమవారం నారాయణపేట పట్టణంలోని సిటిజన్స్ క్లబ్ లో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. అమరవీరుల అత్మశాంతికై రెండు నిమిషాలు మౌనం పాటించారు. మహాసభ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రఘువీర్ యాదవ్ మాట్లాడుతూ యాదవ జవాన్లను స్మరించుకుంటూ రెజాంగ్ లా డే నిర్వహించామని చెప్పారు.