నారాయణపేట: భూముల సమస్యలు కోర్టులో పరిష్కరించుకోవాలి

78பார்த்தது
నారాయణపేట: భూముల సమస్యలు కోర్టులో పరిష్కరించుకోవాలి
భూములకు సంబంధించిన సివిల్ సమస్యలు కోర్టు పరిదిలో పరిష్కరించుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులను పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని బాధితులకు భరోసా కల్పించారు. మొత్తం 8 ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி