నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన న్యాయస్థానంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ న్యాయ విజ్ఞాన సదస్సు ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుందని, మహిళలు చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే ఫోక్స చట్టం ద్వారా 20 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.