లింగాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల బైపీసీ రెండవ సంవత్సర విద్యార్థి భాను ప్రసాద్ అండర్ 17 అథ్లెటిక్స్ 400 మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ కనబరుస్తూ బుధవారం 68వ ఎస్జిఎఫ్ జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ బాలస్వామి తెలిపారు. అండర్ 17 అథ్లెటిక్స్ 400 మీటర్ల పరుగు పందెంలో రెండవ స్థానాన్ని పొందిన భాను ప్రసాద్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు.