కాంగ్రెస్ ప్రభుత్వం తోనే యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు పై అవగాహన సదస్సు నిర్వహించారు. నియోజకవర్గంలోని యువత వీటిని సద్వినియోగం చేసుకొని స్వయంకృషితో ఎదగాలని కోరారు. యువత చెడు మార్గంలో పయనించకుండా వ్యాపారాలపై దృష్టి సారించాలని కోరారు.