దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బెలొలి తాలూకా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన భూత్ లెవల్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సైనికులుగా పని చేయాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు.