మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం బీసీ కమిషన్ ప్రతినిధి బృందం బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. బీసీ కమిషనర్ ఛైర్మెన్ నిరంజన్ నేతృత్వంలో జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మీలు వస్తున్నారని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నేతలు బీసీ వర్గాల విద్య, ఉద్యోగ, రాజకీయాలలో అవసరమైన రిజర్వేషన్లు దామాషాపై తమ అభిప్రాయాలను తెలియజేయాలన్నారు.