మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అమిస్తాపూర్ లో నిర్వహిస్తున్న రైతు విజయోత్సవ సభ స్థలాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.