మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా చెరుకు రైతుల అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానని చెరుకు అభివృద్ధి సంస్థ ఛైర్మన్ (సీడీసీ) పి. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తకోటలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో పి. చంద్రశేఖర్ రెడ్డి సీడీసీ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. రైతుల సమస్యలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.