ఘనంగా కాళికాదేవి బ్రహ్మోత్సవాలు

54பார்த்தது
దేవరకద్ర నియోజకవర్గం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్టలో కాళికాదేవి బ్రహ్మోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజామున నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే అమ్మవారికి సంబంధించిన ఆభరణాలను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி