ఆరోగ్య బీమా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని తీసుకొచ్చింది. 70 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ ఈ స్కీమ్ ద్వారా ఉచితంగా రూ. 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్‌ని కల్పిస్తోంది. 70 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు గల సీనియర్ సిటిజనులు ఆస్పత్రిలో చేరినప్పుడు 25 రకాలు హెల్త్ ప్యాకేజీలను అందిస్తోంది. వివరాలకు https://www.myscheme.gov.in/schemes/ab-pmjay వెబ్‌సైట్‌ని సందర్శించగలరు.