మాజీ ఎంపీ ప్రజ్వల రేవణ్ణ బెయిల్‌ పిటీషన్‌ కొట్టివేత

59பார்த்தது
మాజీ ఎంపీ ప్రజ్వల రేవణ్ణ బెయిల్‌ పిటీషన్‌ కొట్టివేత
అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన జెడి(ఎస్‌) మాజీ ఎంపీ ప్రజ్వల రేవణ్ణ దాఖలు చేసి బెయిల్‌ పిటీషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ కేసులో రేవణ్ణ బయటకు వస్తే విచారణను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రేవణ్ణకు బెయిల్‌ తిరస్కరిస్తూ అక్టోబర్‌ 21న కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி