దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతున్నది. గాలిలో తేమ పెరిగినా కొద్ది కాలుష్యం తీవ్రమవుతున్నది. ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 300 దాటింది. భజన్‌పురా ఏరియాలో ఉదయం 10 గంటలైనా మంచుకప్పుకుని చీకటి చీకటిగానే ఉంది. రోడ్లపై విజుబిలిటీ సరిగా లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.