పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది ‘అవని లేఖ’. జైపూర్‌కు చెందిన అవని 11 సంవత్సరాల వయసులో ఓ ఘోరమైన ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి ఆమె వీల్ చైర్‌కే పరిమితమైంది. అయినా ఏమాత్రం బెదరకుండా పట్టుదలతో ఎయిర్ రైఫిల్‌లో శిక్షణ తీసుకుంది. 2015 నుంచి శిక్షణ తీసుకుని 2020 పారాలింపిక్స్‌లో పాల్గొని ఆర్-2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుంది.