హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్‌లోని పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు తయారు చేసే ఎంఎన్ పాలిమర్స్ అనే పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకుని పరిశ్రమలోని ముడిసరకు, అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ప్లేట్లు, తయారీకి ఉపయోగించే యంత్రాలు కాలిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. కాగా, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.