విద్యావ్యవస్థను బాగుచేయడానికి విద్యా కమిషన్ ఏర్పాటు చేశామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీస్టేడియంలో బాలల దినోత్సవం కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న క్రమంలో నవంబర్ 14 నుంచి డిసెంబర్ 7 వరకు విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. బాలల దినోత్సవంలో ఉత్సవాలు ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నెహ్రూ వేసిన విద్యా పునాదులతోనే పేదలకు విద్యావకాశాలు వస్తున్నాయన్నారు.