నల్ల జీలకర్ర తింటే ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల జీలకర్ర తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తామర వంటి చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. జీవక్రియను పెంచుతుంది. బరువును అదుపులో ఉంచుతుంది. ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులను తగ్గిస్తుంది. ముఖ్యంగా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో షుగర్ సమస్య ఉన్నవారికి ఇది మంచి ఔషదమని చెప్పొచ్చు.