AP: మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో ఓ తాగుబోతు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో కరెంటు స్తంభంపైకి ఎక్కాడు. అతడిని గమనించిన స్థానికులు వెంటనే ట్రాన్స్ ఫార్మర్ ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అతడిని దిగమని ఎంత చెప్పిన వినకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు. కాసేపు అక్కడే విన్యాసాలు చేశాడు. అందరూ కలిసి బలవంతంగా అతడిని కిందికి తీసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.