ఐపీఎల్ మెగా వేలంలో ఓ మహిళ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆమే వేలం నిర్వాహకురాలు మల్లిక సాగర్. ముంబైకి చెందిన మల్లిక సాగర్ ఓ ఆర్ట్ కలెక్టర్. 49 ఏళ్ల మల్లిక.. క్రిస్టీస్ ఆక్షన్ హౌస్లో వేలం నిర్వాహకురాలిగా కెరీర్ మొదలుపెట్టారు. 2001లో న్యూయార్క్లో తొలిసారిగా మోడ్రన్ ఇండియన్ ఆర్ట్ వేలం నిర్వహించారు. 2023 ఫిబ్రవరిలో ‘మహిళా ప్రీమియర్ లీగ్ (WPL)’ వేలం నిర్వహించారు. అదే ఏడాది చివర్లో దుబాయి వేదికగా ఐపీఎల్ వేలం కూడా నిర్వహించారు.