ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించాలని కేఏ పాల్ పిటిషన్ పిటిషన్లో కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం స్పీకర్ పరిధిలో ఉందని హైకోర్టు చెప్పింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఇటీవల తీర్పులో వెలువరించామని పేర్కొంది. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే ఆ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించలేమని స్పష్టం చేసింది.