వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడికి పాల్పడిన ఘటనలో బాధ్యులను వదిలిపెట్టమని ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. బోగమోని సురేశ్ అనే వ్యక్తి అధికారులపై దాడికి ప్లాన్ చేశాడని తెలిపారు. కొందరిని అతడే గ్రామానికి తీసుకెళ్లి రాళ్లు, కర్రలతో కొట్టించాడని చెప్పారు. ఇందులో పాల్గొన్న వారిని వీడియోల ద్వారా గుర్తించామని, వారిని ప్రేరేపించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.