TG: సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్త దందాకు తెరలేపారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ డీపీతో శుక్రవారం హైదరాబాద్ ప్రజలకు పాకిస్థాన్ నెంబర్‌లతో ఫేక్ వాట్సాప్ కాల్స్ చేసి భయపెట్టారు. దీనిపై తాజాగా సీపీ ఆనంద్ స్పందించారు. తన ఫోటో డీపీగా ఉన్న నెంబర్ నుంచి కాల్స్ వస్తే స్పందించవద్దని, ఇలాంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏవైనా అనుమానాలు ఉంటే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్స్ చేయాలని కోరారు.